: జార్ఖండ్ లో మోడీ హవా... బీజేపీదే అధికారం: ఏబీపీ నీల్సన్ ఎగ్జిట్ పోల్స్


దేశ వ్యాప్తంగా మోదీ హవా నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో బీజేపీ పాగా వేస్తోంది. ఈ రోజు జార్ఖండ్ లో తుది విడత పోలింగ్ ముగిసింది. ఏబీపీ నీల్సన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ భారీ మెజారిటీతో అధికార పీఠం దక్కించుకోనుంది. మొత్తం 81 స్థానాలకు గాను ఎన్డీఏ 52 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. ఇందులో బీజేపీ-46, ఏజేఎన్ యూ-5, ఎల్జేపీ-1 స్థానాలను గెలుచుకోబోతున్నాయి. యూపీఏ కూటమి కేవలం 9 స్థానాలకే పరిమితం కానుంది. ఇందులో కాంగ్రెస్-7, ఆర్జేడీ-1, జేడీయూ-1 స్థానాన్ని గెలుచుకోనున్నాయి.

  • Loading...

More Telugu News