: జమ్మూకాశ్మీర్ మంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు


జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మంత్రి, బిలావర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ లాల్ శర్మతో పాటు మరో నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. గత రాత్రి మనోహర్ లాల్ శర్మ మద్దతుదారులు బిలావర్ నియోజకవర్గంలోని ఖబ్ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా మరోపార్టీకి చెందిన వారు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మనోహర్ లాల్ తన మద్దతుదారులతో అక్కడికి చేరుకున్నారు. ఇంతలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో మనోహర్ లాల్ దురుసుగా ప్రవర్తించారు. వారిపై దాడికి దిగారు. అంతటితో ఆగకుండా పోలీసులపై దాడి చేయాలని మద్దతుదారులను రెచ్చగొట్టారు. దీంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News