: 'పాకిస్థాన్ 9/11'గా పెషావర్ దుర్ఘటన


పాకిస్థాన్ లో ప్రధాన నగరమైన పెషావర్ లోని సైనిక పాఠశాలపై ఈ నెల 16న తెహ్రీక్ ఏ తాలిబన్ జరిపిన దాడికి ఆ దేశం నామకరణం చేసింది. ఆ దుర్ఘటన 'పాకిస్థాన్ 9/11' అని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. భారత్ లోని ముంబైలో జరిగిన పేలుళ్లకు 26/11 అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ఆర్మీకి సాయం చేస్తామని ఆఫ్ఘన్ నాయకత్వం హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరూ కలసి పాక్, ఆఫ్ఘన్ సరిహద్దులో తీవ్రవాదులపై కార్యకలాపాలు కొనసాగిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News