: వృద్ధుడికి మత్తుమందిచ్చి, వీడియో తీసి బెదిరిస్తున్న యువతి
సాధారణంగా యువతుల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న పురుషుల ఉదంతాలను చాలానే చూశాం. ఇది అందుకు పూర్తిగా వ్యతిరేకం. మీరట్ పోలీసు అధికారి ఓంకార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, 20 సంవత్సరాల యువతి ఒకరు బ్యాంకు ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన 70 ఏళ్ల వృద్ధుడితో పరిచయం పెంచుకుంది. ఆయనకున్న ఆరోగ్య అవసరాలు తీరుస్తామని చెబుతూ ఓ ఔషద కేంద్రంలో సభ్యుడిగా చేర్పించింది. స్పెషల్ మెడిసిన్ అంటూ ఇచ్చిన మూలికలు తిన్న ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. లేచిన తరువాత యువతితో పాటు మరో ఇద్దరు వచ్చి మొబైల్ లో చిత్రీకరించిన ఒక ఎంఎంఎస్ ను చూపారు. అందులో నగ్నంగా ఉన్న వృద్ధుడు ఆ యువతితో దగ్గరగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. దాన్ని చూపి డబ్బులివ్వకుంటే నెట్ లో వీడియో పెడతామని బెదిరిస్తే, పరువు పోతుందని భావించిన ఆయన రూ.5 లక్షలు చెల్లించాడు. వాళ్ళు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయగా, తన వద్ద లేవని బదులివ్వడంతో కిడ్నీ ఇవ్వాలని బెదిరించారు. ఇక లాభంలేదని ఆయన పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.