: ఏపీకి ప్రత్యేక హోదాపై మార్చికంతా తెలిసిపోతుంది: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది రానిది మార్చి కంతా తెలిసిపోతుందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రాజధానికి సంబంధించిన సీఆర్డీఏ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టామని అన్నారు. సభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం, గవర్నర్ వద్దకు పంపుతామని, ఆయన ఆమోదించిన తరువాత రాజధాని కోసం భూసేకరణ జరుపుతామని ఆయన వివరించారు. భూసేకరణ సమయంలో రాజధాని కోసం భూములు ఇస్తున్నట్టు అఫిడవిట్లు తీసుకుంటామని యనమల వెల్లడించారు. వీజీటీఎం పరిధిలోని అప్పులు, ఆస్తులు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు.