: కేంద్ర ప్రభుత్వం అందరి కంటే ఎక్కువ ప్రాధాన్యత కేసీఆర్ కే ఇస్తోందట!


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంల కంటే కేంద్రం కేసీఆర్ కే ఎక్కువ విలువ ఇస్తోందని తెలిపారు. కేసీఆర్ సూచించిన అనేక అంశాలను కొత్త ప్లానింగ్ కమిషన్ లో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాల రచనలో రాష్ట్రాలకు ప్రమేయం ఉండాలన్న విషయాన్ని కేంద్రం దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లారని... ఎందుకంటే, ఆ పథకాలు అమలు కావాల్సింది రాష్ట్రాల్లోనే అని బూర తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో లోపాలున్నాయన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలతో తాము ఏకీభవిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News