: శివసేన నేత ఏక్ నాథ్ షిండేకు బెదిరింపు ఫోన్ కాల్స్
శివసేన సీనియర్ నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే మొబైల్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వెంటనే ఆయన థానే కమిషనరేట్ పోలీసులకు ఫిర్యాదు చేసి, వివరాలు తెలియజేశారు. ఈ క్రమంలో వాగ్లే ఎస్టేట్ ప్రాంతంలోని షిండే నివాసం వద్ద అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్ర శీతాకాల సమావేశాలు జరుగుతుండటంతో నాగపూర్ లోని అధికారిక బంగ్లాలో ఆయన ఉంటున్నారు. ఆ సమయంలోనే ఓ వ్యక్తి తన మొబైల్ కు ఫోన్ చేసి మంత్రిని దూషించడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరించాడట. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.