: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రూ.10 వేల జరిమానా


తామిచ్చిన తీర్పునకు కట్టుబడక పోవడంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ కోర్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రూ.10 వేల జరిమానా విధించింది. ఓ పరువునష్టం కేసు విషయమై 18వ తేదీలోగా ప్రమాణపత్రం ఇవ్వాలని కోర్టు గతంలో కేంద్ర మంత్రిని ఆదేశించింది. గడువు పూర్తయినా, ఆయన ప్రమాణపత్రం సమర్పించకపోవడంతో న్యాయమూర్తి గోమతి మనోచా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గడ్కరీకి ఈ జరిమానా విధించారు. గడ్కరీ స్పందించకుంటే కోర్టు ధిక్కారం కింద పరిగణించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News