: మోసం చేసిన లెక్చరర్ పై యాసిడ్ పోసి ప్రతీకారం తీర్చుకున్న యువతి


ప్రేమ పేరిట మోసం చేసిన లెక్చరర్ పై ప్రతీకారం తీర్చుకుందో సబల. గుంటూరు జిల్లా నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలో పని చేస్తున్న ఓ లెక్చరర్ పై అదే కళాశాలలో చదువుతున్న సౌజన్య అనే విద్యార్థిని యాసిడ్ తో దాడి చేసింది. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ లెక్చరర్ వెంకటరమణను జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంకటరమణ మోసం చేశాడని సౌజన్య ఆరోపించింది. వేరే పెళ్లి చేసుకున్నాడని, తనకు జరిగిన అన్యాయానికి ప్రతిగా తాను దాడికి పాల్పడ్డానని ఆమె స్పష్టం చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News