: ఆఫ్ఘనిస్థాన్ లో 141 మంది తాలిబన్లు హతం
పెషావర్ దారుణ ఘటన అనంతరం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లలో ఉగ్రవాదులపై సైనిక దాడులను ముమ్మరం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లో గత నలభై గంటల నుంచి కొనసాగిన దాడుల్లో ఏకంగా 141 మంది తాలిబన్లను మట్టుబెట్టారు. కునార్, ఉరుంగజ్, బాల్క్, హెల్మాండ్, ఘంజీ, నాన్ గార్హర్ తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగినట్టు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది. దాడుల సమయంలో తాలిబన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని తెలిపింది. భారీ ఆయుధాలు, బాంబులతో తాలిబన్లు ఎదురు దాడికి దిగారని చెప్పింది.