: నటుడు ఆహుతి ప్రసాద్ కు క్యాన్సర్?
సినీ నటుడు ఆహుతి ప్రసాద్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆహుతి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు పెదవి విప్పడం లేదు. ఆహుతి ప్రసాద్ అసలు పేరు జనార్ధన వరప్రసాద్. కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి పక్కన ఉన్న కోడూరు ఆయన స్వగ్రామం. 1986లో 'విక్రమ్' సినిమా ద్వారా పరిచయమైన ఆయనకు 'ఆహుతి' సినిమా బ్రేక్ ఇచ్చింది. ఎన్నో సినిమాలలో గుర్తుంచుకోదగ్గ పాత్రలు వేసి, ప్రేక్షకులను అలరించారు ఆహుతి ప్రసాద్.