: హుదూద్ తుపానుతో ఊహించిన దానికన్నా ఎక్కువ నష్టం: అసెంబ్లీలో చంద్రబాబు
హుదూద్ తుపాను ఉత్తరాంధ్రను ముంచెత్తడం చాలా బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హుదూద్ తుపానుపై శాసనసభలో చేపట్టిన చర్చలో భాగంగా నేటి మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. తుపాను ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఇది 'పెను తుపాను' అని ముందే ఊహించి, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు చర్యలూ తీసుకున్నామని అసెంబ్లీకి ఆయన వివరించారు. నిరంతర పర్యవేక్షణతో తుపాను నష్టాన్ని తగ్గించామని తెలిపారు.