: మోదీ, మమతా బెనర్జీల పరస్పర నమస్కారాలు!
ఇటీవల రాజకీయాల్లో తీవ్ర ప్రత్యర్థులుగా మారిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తాజాగా పరస్పర నమస్కారాలు చేసుకున్నారు. ఇందుకు రాష్ట్రపతి భవన్ వేదికయింది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ భారత్ పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంతో ప్రధాని పరిచయం చేసుకుని, ముచ్చటించారు. ఈ విందులో కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు హాజరయిన మమత ఎదుటపడటంతో మర్యాదపూర్వకంగా మోదీ నమస్కరించారు. ప్రతిగా దీదీ కూడా మాట్లాడారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో వారిద్దరూ ఎదురుపడటం ఇదే తొలిసారి. ముఖ్యంగా శారదా చిట్ ఫండ్ స్కాంలో సీబీఐ దర్యాప్తు, తృణమూల్ పార్టీకి చెందిన నేతలు అరెస్టవడంతో మమతా మోదీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు.