: రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెటైర్లు వేశారు. ఇటాలియన్ కళ్లద్దాలు ధరించిన రాహుల్ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని సరిగా చూడలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. కేరళలోని పాలక్కాడ్ లో షా మాట్లాడుతూ, గాంధీ (రాహుల్) వెండి స్పూన్ తో పుడితే, ప్రధాని దారిద్ర్యంలో జన్మించారని చెప్పారు. తద్వారా ప్రజల కష్టాలు మోదీకే బాగా తెలుసన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఎన్డీఏ సర్కారు ఆరు నెలల పాలనలో పది సార్లు పెట్రోల్ ధరలు తగ్గించిందని చెప్పారు. ఇక, పార్టీ కేరళ కార్యకర్తలను ఉద్దేశించి, అధికారం చేజిక్కించుకునే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో, అనుకూల వాతావరణాన్ని సద్వినియోగపరుచుకోవాలని అమిత్ షా సూచించారు.

  • Loading...

More Telugu News