: ప్రధానిని కలిసిన అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. వ్యక్తిగత పనుల నిమిత్తం దేశ రాజధానికి వచ్చిన 'బిగ్ బి' ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రధానితో అమితాబ్ భేటీ తాలూకు ఫొటోను ట్విట్టర్లో ఉంచింది. అయితే, అమితాబ్ ప్రధానితో ఏం మాట్లాడారన్నది మాత్రం వెల్లడి కాలేదు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్ కు అమితాబ్ పర్యాటక ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.