: సీఆర్డీఏ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం
సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్డీఏ నిర్ణాయక మండలి ఏర్పాటు కానుంది. సీఆర్డీఏ బిల్లు ద్వారా భూ సమీకరణకు చట్ట బద్ధత లభించనుంది. ముప్పై ఏళ్ల పాటు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బిల్లు రూపకల్పన చేసినట్టు మంత్రి నారాయణ తెలిపారు.