: వయసు మీదపడడం వల్ల చంద్రబాబు హామీలను కూడా మర్చిపోయారు: రోజా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు మీద పడిందని... అందుకే ఇచ్చిన హామీలను కూడా ఆయన మరచిపోతున్నారని వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి రోజా ఎద్దేవా చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని... వారు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఐకేపీ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.