: స్పీకర్ కు సభాహక్కుల నోటీసు ఇచ్చిన భూమా
కర్నూలు జిల్లా నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సభాహక్కుల నోటీసు ఇచ్చారు. కర్నూలు జిల్లా పోలీసులపై చర్యలు తీసుకోవాలని నోటీసులో కోరారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తన హక్కులను కాలరాశారని... దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విన్నవించారు.