: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం... 1000 కిలోల బాంబు పరీక్ష విజయవంతం


సుమారు 100 కిలోమీటర్ల దూరం వరకూ ఎటు చెబితే అటు వైపు ప్రయాణించి నిర్దేశిత లక్ష్యాన్ని చేరే టన్ను బరువున్న బాంబును విజయవంతంగా పరీక్షించినట్టు డీఆర్డీఓ తెలిపింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ గ్లయిడ్ బాంబును ఒడిశా తీరం నుంచి బంగాళాఖాతంలో పరీక్షించామని, వైమానిక దళానికి చెందిన విమానం ఈ బాంబును జారవిడిచిందని డీఆర్డీఓ డైరెక్టర్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి తెలిపారు. స్వీయ నావిగేషన్ వ్యవస్థ దీనికి అదనపు ప్రత్యేకతని వివరించారు. మిసైళ్ళతో పోలిస్తే ఇవి చవకైనవని తెలిపారు.

  • Loading...

More Telugu News