: ప్రత్యామ్నాయ వ్యూహాలు కొరవడ్డాయి: టీమిండియా బౌలర్లపై సన్నీ విమర్శలు
బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ టెయిలెండర్లను అవుట్ చేయడంలో భారత బౌలర్లు విఫలం కావడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశాడు. లోయరార్డర్ బ్యాట్స్ మెన్ ను అవుట్ చేసేందుకు భారత బౌలర్ల వద్ద ప్రత్యామ్నాయ వ్యూహాలు కొరవడ్డాయని అన్నాడు. ఇది భారత్ కు కొత్తేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న సమస్యేనని చెప్పాడు. "ఇది అలవాటైన విషయమే. ఇంతకుముందు న్యూజిలాండ్ పర్యటనలోనూ ఇదే పరిస్థితి చూశాం. 'ప్లాన్ ఎ' విఫలం అయినప్పుడు ఉపయోగించే 'ప్లాన్ బి' లేని లోటును గుర్తించాను. జాన్సన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మన బౌలర్లు 70 ఓవర్లు నలిగిన బంతితోనూ బౌన్స్ రాబట్టాలని ప్రయత్నించడం గమనించాను. కానీ, జాన్సన్ ఖాతాలో ఓ టెస్టు సెంచరీ కూడా ఉంది. అలాంటి బ్యాట్స్ మన్ కుదురుకునేందుకు అవకాశమిచ్చారు మనవాళ్లు" అని విమర్శించారు.