: విజయనగరం జిల్లాలో బొత్స అక్రమాలకు పాల్పడ్డారు: ఎమ్మెల్యే అప్పలనాయుడు


మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అక్రమాలపై ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ప్రస్తావించారు. విజయనగరం జిల్లాలో ఆయన లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారని ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోపించారు. సహకార రుణాల్లో అక్రమాల అంశంపై చర్చిస్తూ, బొత్స, ఆయన అనుచరులు బినామీ పేర్లతో పెద్ద ఎత్తున రుణాలు పొందారని తెలిపారు. జిల్లాలోని రావివలస సహకార బ్యాంక్ నుంచే రూ.9 కోట్ల బినామి రుణాలు పొందారని చెప్పారు. కాబట్టి జిల్లాలో 94 సహకార సంఘాలలో మంజూరైన రుణాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు వెంటనే స్పందించిన మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, కొన్ని సొసైటీల్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. గత పదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని సభాముఖంగా తెలిపారు.

  • Loading...

More Telugu News