: ఆస్ట్రేలియాలో 8 మంది చిన్నారులను పాశవికంగా చంపింది కన్న తల్లే
ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్ పట్టణంలో సంచలనం సృష్టించిన 8 మంది చిన్నారుల హత్య కేసులో కన్న తల్లిని దోషిగా పోలీసులు నిర్ధారించారు. మృతి చెందిన 8 మందిలో ఏడుగురు ఆమె కడుపున పుట్టినవారేనని, మరొకరికి ఆమె పిన్ని అని సౌత్ క్వీన్స్ లాండ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పిల్లలను చంపిన తరువాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని వివరించారు. మృతి చెందిన చిన్నారుల వయసు 18 నెలల నుంచి 15 ఏళ్ల వరకూ ఉందని, వీరిని పదునైన ఆయుధంతో పొడిచి చంపిందని తెలిపారు.