: రాజకీయంగా బీజేపీ మాతో పోటీపడలేదు: మమతా బెనర్జీ
దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ పశ్చిమ బెంగాల్లో తమకు ప్రమాదకరంగా మారుతుందని భావించడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పై ఎలాంటి సవాలు చేయలేకే తమపై సీబీఐని ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో తన నివాసంలో మాట్లాడిన దీదీ, బెంగాల్లో బీజేపీ హవా లేదని, కేవలం మీడియా చేస్తున్న హడావుడేనని అన్నారు. అంతేగాక రాజకీయంగా బీజేపీ తమతో పోటీపడలేదని, సరితూగదని వ్యాఖ్యానించారు. తమను అవహేళన చేయాలని ప్రయత్నించేందుకే సీబీఐని వాడుతున్నారని అన్నారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా తన వద్ద సరైన సాక్ష్యాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని మమత చెప్పారు.