: వార్నర్, వాట్సన్ లను బలిగొన్న ఇషాంత్... ఆసీస్ 44/2
స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఇషాంత్ శర్మ ఆరంభంలోనే షాకిచ్చాడు. ప్రమాదకర ఓపెనర్ వార్నర్ (6)ను తొలుత బలిగొన్న ఇషాంత్, ఆ తర్వాత వచ్చిన షేన్ వాట్సన్ ను డకౌట్ చేశాడు. దీంతో, ఆసీస్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 2 వికెట్లకు 44 పరుగులు కాగా, క్రీజులో ఓపెనర్ రోజర్స్ (26*), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (8*) ఉన్నారు. అంతకుముందు, భారత్ రెండో ఇన్నింగ్స్ లో 224 పరుగులకు ఆలౌటైంది. దీంతో, ఆసీస్ ముందు 128 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.