: కదిలిన పాకిస్తాన్... ఇద్దరు ఉగ్రవాదులకు ఉరి... నేడో రేపో మరింతమందికి!


2008 తరువాత పాకిస్తాన్ లో తొలిసారిగా ఇద్దరికి ఉరిశిక్ష అమలు చేశారు. ఉరి అమలుపై ఉన్న నిషేధాన్ని తొలగించిన నేపధ్యంలో నేటి ఉదయం ఇద్దరు ఉగ్రవాదులు డాక్టర్ ఉస్మాన్, అర్షద్ మెహమూద్ లను ఫైసలాబాద్ జైలులో ఉరితీసినట్టు సెంట్రల్ పంజాబ్ హోం మంత్రి షుజా ఖాన్ తెలిపారు. 2009లో రావల్పిండిలోని సైనిక కేంద్రంపై దాడి చేసిన కేసులో డాక్టర్ ఉస్మాన్, 2003లో పర్వేజ్ ముషారఫ్ పై జరిగిన హత్యాయత్నం కేసులో అర్షద్ దోషులుగా ఉన్నారు. పాక్ లో మరో ఆరుగురు మరణశిక్ష పడ్డ ఖైదీలకు శిక్ష అమలు చేసేందుకు అనుమతి మంజూరు అయినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News