: ఆ రూ. 50 లక్షలను జగన్ ఎప్పుడు, ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలి: లోకేష్
వైకాపా అధినేత జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్లో మండిపడ్డారు. హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం జగన్ రూ. 50 లక్షలు ఇస్తామని గతంలో ప్రకటించారని లోకేష్ అన్నారు. ఆ డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారో? వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో ట్విట్టర్లో నారా లోకేష్ వైరి పక్ష నేతలైన కేసీఆర్, జగన్ లపై విమర్శలు ఎక్కుపెడుతున్న సంగతి తెలిసిందే.