: ఇషాంత్, రైనా 'వెజ్' కష్టాలు


ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాలో ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు. పాపం, బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా వారిద్దరూ ఇబ్బందికి గురయ్యారు. మూడో రోజు ఆట సందర్భంగా లంచ్ కు వెళితే అక్కడ వారు కోరుకున్న సాత్వికాహారం కనిపించలేదు. వాటి స్థానంలో మసాలా దట్టించిన మాంసాహార వంటకాలు దర్శనమిచ్చాయి. దీంతో, వారిద్దరూ మైదానం వెలుపల ఓ రెస్టారెంట్లో కడుపు నింపుకున్నారు. ఇషాంత్, రైనాతో పాటు కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రి కూడా శాకాహారం కోసం అలమటించిపోయాడట. ఇదిలావుంటే, ఆటగాళ్లు, కోచింగ్ డైరక్టర్ మైదానం వీడడంతో వారి వెంటే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులు కూడా వెళ్లడం గమనార్హం. బుకీలతో ఆటగాళ్ల సంబంధాలపై ఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టిన కారణంగానే, అధికారులు ఆటగాళ్లతో పాటు రెస్టారెంటుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News