: "బాబు వస్తారు... జాబ్ వస్తుంది" అని జగన్ అనగానే మైక్ కట్!


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, "బాబు వస్తారు... జాబ్ వస్తుంది..." అంటుండగానే స్పీకర్ కోడెల ఆయన మైక్ ను కట్ చేశారు. నేటి సభలో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో జగన్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన ప్రసంగిస్తూ, అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఐకేపీ, అంగన్ వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా, ఎన్నికల సమయంలో తెలుగుదేశం ఇచ్చిన హామీలను ప్రస్తావించబోతే స్పీకర్ అడ్డుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News