: అత్యుత్తమ పాలకుల్లో మోదీకి రెండో స్థానం


అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ప్రజల్లో విశేష గుర్తింపు పొందిన పాలకుల్లో భారత ప్రధాని నరేంద్రమోదీ రెండవ స్థానంలో నిలిచారు. జపాన్‌కు చెందిన ఓ పరిశోధన సంస్థ నిర్వహించిన సర్వేలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్ తొలిస్థానంలో నిలిచారు. మొత్తం 30 మంది దేశాధినేతలపై సర్వే నిర్వహించినట్టు టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న జీఎంవో పరిశోధన సంస్థ తెలిపింది. వీరిద్దరి తరువాత జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నిలిచారు.

  • Loading...

More Telugu News