: స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైఎస్సార్సీపీ సభ్యులు
ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో, ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలకు తెరలేపారు. ఐకేపీ కార్మికుల సమస్యలపై సంబంధిత శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సిందేనని, చర్చ జరగాల్సిందేని వారు పట్టుబడుతున్నారు. వైఎస్సార్సీపీ సభ్యులను సముదాయించాలని స్పీకర్ ప్రతిపక్ష నేత జగన్ ను కోరారు.