: అసెంబ్లీ సమావేశాలు ఆరంభం... మధ్యాహ్నం రుణమాఫీపై చంద్రబాబు ప్రకటన
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా, రుణమాఫీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రకటన చేయనున్నారు. ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ సవరణ బిల్లును సర్కారు నేడు సభలో ప్రవేశపెట్టనుంది. అటు, మంత్రి గంటా శ్రీనివాసరావు విద్యా విధాన సవరణ బిల్లును ప్రవేశపెడతారు. ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ వైద్య విధాన పరిషత్ గణాంకాలను సభకు సమర్పిస్తారు.