: 'వరల్డ్ సూపర్ సిరీస్' సెమీస్ లో సైనా, శ్రీకాంత్
భారత సూపర్ షట్లర్ సైనా నెహ్వాల్, యువ కెరటం కిదాంబి శ్రీకాంత్ దుబాయ్ లో జరుగుతున్న వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీస్ లో ప్రవేశించారు. మహిళల విభాగంలో సైనా కొరియా అమ్మాయి బే యోన్ జు పై 15-21, 21-7, 21-17తో ఘనవిజయం సాధించింది. వరల్డ్ నెంబర్ 4 క్రీడాకారిణి సైనా ఈ మ్యాచ్ లో తొలి గేమును కోల్పోయినా, పట్టుదలతో తర్వాతి రెండు గేములను నెగ్గడం విశేషం. ఇక, పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్ తన చివరి మ్యాచ్ ను ఓడినా సెమీస్ చేరాడు. ఈ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో శ్రీకాంత్ 21-17, 12-21, 14-21తో డెన్మార్క్ కు చెందిన జార్గెన్సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో, గ్రూపులో రెండో స్థానంతో శ్రీకాంత్ సెమీస్ బెర్తును దక్కించుకున్నాడు.