: మూడు నెలల అనంతరం ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో బౌలింగ్ చేసిన అజ్మల్
ఐసీసీ సస్పెన్షన్ విధించడంతో మూడు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఎట్టకేలకు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ లోకి దిగాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో భాగంగా లాహోర్ లో కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్ లో అజ్మల్ బౌలింగ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పాకిస్థాన్- ఎ తరుపున కేవలం ఆరు ఓవర్లు మాత్రమే వేసిన అజ్మల్ ఒక వికెట్టు తీసి 23 పరుగులు ఇచ్చాడు. అయితే తాను చేసిన బౌలింగ్ పై అజ్మల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయతే వరల్డ్ కప్ నాటికి జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.