: పాకిస్థాన్ తీరును తప్పుపట్టిన అసదుద్దీన్ ఒవైసీ
లఖ్వీకి బెయిల్ ఇవ్వడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, మూడేళ్లుగా జైల్లో ఉంటూనే లఖ్వీ తండ్రయ్యాడంటే పాకిస్థాన్ లోని జైళ్ల నిర్వహణ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చని అన్నారు. పాకిస్థాన్ హైకమీషనర్ ను తక్షణం రప్పించుకుని గట్టిగా హెచ్చరించాలని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ తీరుతెన్నులను అందరూ గమనిస్తున్నారని తెలుసుకోవాలని ఆయన సూచించారు.