: అమ్మాయిలు జీన్స్ ధరించకూడదు, సెల్ ఫోన్ వాడకూడదు!: బీహార్ లో ఓ పంచాయతీ ఆదేశాలు
అమ్మాయిలు జీన్స్ ధరించకూడదని, సెల్ ఫోన్ వాడకూడదని బీహార్ లోని గోపాల్ గంజ్ జిల్లాలోని ఓ పంచాయతీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. అమ్మాయిలు జీన్స్ పాంట్లు, సెల్ ఫోన్ల వల్లే తప్పుదోవ పట్టే అవకాశాలు పెరుగుతున్నాయని పంచాయతీ పెద్దలు అభిప్రాయపడ్డారు. జీన్స్, మొబైల్స్ నిషేధంపై తమ మండల పరిధిలోని ఆడపిల్లల కుటుంబాలను సంప్రదించామని నిషేధం విధించిన పెద్దలు పేర్కొన్నారు. ఈ నిషేధం 2015 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని వారు తెలిపారు. తాము విధించిన నిషేధం పాటించకపోతే జరిమనా విధించడం కానీ, బహిష్కరించడం కానీ చేయడం లేదని వారు వెల్లడించారు.