: బాలుడి కిడ్నాప్ 10 లక్షలు డిమాండ్
హైదరాబాదులో కిడ్నాప్ కలకలం రేగింది. కుషాయిగూడలోని రోహిత్ అనే 13 ఏళ్ల బాలుడ్ని ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. రోహిత్ స్థానికంగా ఉన్న రాధిక టెక్నో స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ పూర్తయిన తరువాత ఇంటికి వస్తున్న రోహిత్ ను ఆగంతుకులు కిడ్నాప్ చేశారు. అనంతరం బాలుడి ఇంటికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు 10 లక్షల రూపాయలను డిమాండ్ చేశారు. దీంతో రోహిత్ తల్లిదండ్రులు కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.