: కృష్ణా తీరంలో రాజధాని నిర్మిస్తే సహించేది లేదు: తెలంగాణ ఎమ్మెల్సీ నాగేశ్వర్
కృష్ణా తీరంలో రాజధాని నిర్మిస్తే సహించేది లేదని తెలంగాణ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాకలో పర్యటించి రైతులతో చర్చించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, బీడు భూములు, మెట్టప్రాంతాల్లో నిర్మించాల్సిన రాజధానిని పచ్చని పంటపొలాలను బీళ్లుగా మారుస్తూ నిర్మించడం సరికాదని అన్నారు. వాస్తు అనేది రాజధాని నిర్మాణానికి ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. సింగపూర్ అభివృద్ధితో ఏపీ అభివృద్ధిని సరిపోల్చడం కూడా సరికాదని ఆయన సూచించారు. సింగపూర్ దేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న విషయాన్ని నేతలు గుర్తించాలని ఆయన తెలిపారు.