: హైదరాబాదుపై చలిపులి పంజా... 2005 పునరావృతమవుతుందా?
2005లోని వాతావరణ పరిస్థితి ఎదురవుతుందా? అని వాతావరణ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2005లో హైదరాబాదులో కనిష్ఠ ఉష్ణోగ్రత 8.7 డిగ్రీలుగా నమోదైంది. తాజాగా నిన్న తెల్లవారు జామున 5 గంటలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 12.2 డిగ్రీలుగా నమోదైంది. ఉత్తరాదిలో వీస్తున్న చలిగాలుల ప్రభావం హైదరాబాదుపై పడింది. దీంతో రాజధానిని చలిపులి వణికిస్తోంది. చల్లగాలులకు తోడు మంచు ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఇళ్లలో ఉన్నవారు కూడా వణుకుతున్నారు. రానున్న 24 గంటల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని బేగంపేటలోని వాతావరణ శాఖ హెచ్చరించింది.