: ఆరుగురు ఉగ్రవాదుల ఉరికి పాక్ సిద్ధం
పెషావర్ లో జరిగిన దారుణ మారణకాండతో పాక్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. దీంతో ఉరిశిక్ష పడ్డ ఖైదీలను ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆరుగురు తీవ్రవాదులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఆర్మీ చీఫ్ రహీల్ క్లియరెన్స్ ఇవ్వడంతో వారిని ఏ క్షణంలో అయినా ఉరి తీసే అవకాశముంది. కాగా, ఆరుగుర్నీ ఒకేసారి ఉరి తీసేకంటే ముందుగా ఇద్దర్ని ఉరి తీయాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ పై దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ముందుగా ఉరితీసే అవకాశం ఉంది.