: బంగ్లాదేశ్ అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ తో సమావేశమయ్యారు. ఆరు రోజుల భారత్ పర్యటనలో ఉన్న హమీద్ ని మోదీ హైదరాబాద్ హౌస్ లో కలిశారు. ఈ చర్చల్లో రెండు దేశాలకు పరస్పర లాభదాయక ప్రాజెక్టుల కోసం పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ వెల్లడించినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ మొదట బంగ్లాదేశ్ నుంచే ప్రారంభిస్తున్నట్టు మోదీ తెలిపారని ఆయన ట్వీట్ లో తెలిపారు.