: జగన్! నాతో పోటీకి సిద్దమా? ... జగనెందుకు, నేను చాలు, నాతో పోటీకొస్తావా?: గంటా-జ్యోతుల పరస్పర సవాళ్లు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లింది. హుదూద్ తుపాను సహాయక చర్యలకోసం జరిగిన చర్చలో టీడీపీ, వైఎస్సార్సీపీ తొడలుగొట్టుకున్నాయి. 'నాతో పోటీ కొస్తావా? నీ ప్రతాపమూ, నా ప్రతాపమూ చూసుకుందాం' అంటూ రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు. హుదూద్ సమయంలో తాను వారం రోజులు విశాఖలో పర్యటిస్తే, స్థానిక మంత్రి గంటా శ్రీనివాసరావు జ్వరం అంటూ పడుకున్నారని జగన్ ఎద్దేవా చేశారు. దీనికి సమాధానమిస్తూ, తానేం చేశానో తన నియోజకవర్గ ప్రజలకు తెలుసని తెలిపిన గంటా, జగన్ కు చేతనైతే రాజీనామా చేసి వస్తే, తామిద్దరం పోటీ చేద్దాం రమ్మని సవాలు విసిరారు. దీంతో, వైఎస్ఆర్సీ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ ప్రతి సవాల్ విసురుతూ గంటాతో పోటీకి జగన్ అవసరం లేదని, తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా గంటా పోటీకి వస్తానంటే తాను సిద్ధమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News