: పెషావర్ సైనిక పాఠశాలను సందర్శించనున్న పాక్ క్రికెటర్లు


పెషావర్ లోని ఓ సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడి చేయగా, 132 మంది విద్యార్థులు ప్రాణాలు విడిచిన ఘటనపై ప్రపంచవ్యాప్తంగా విచారం వ్యక్తమైంది. తాలిబన్ల దుశ్చర్యను అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండిచాయి. ఈ దారుణంపై పాక్ క్రికెట్ జట్టు కూడా స్పందించింది. కివీస్ తో నాలుగో వన్డే సందర్భంగా ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. తాజాగా, పాక్ క్రికెటర్లు ఈ పాఠశాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. న్యూజిలాండ్ తో సిరీస్ లో పాక్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న షాహిద్ అఫ్రిది ఈ పాఠశాలను సందర్శించాలని ప్రతిపాదించగా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News