: క్రిస్మస్ కు రెండు రోజులు సెలవు, న్యూ ఇయర్ రోజు కూడా సెలవే: కేసీఆర్ వరాల జల్లు
తెలంగాణలో క్రిస్మస్ కు రెండు రోజులు సెలవులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్ లోని లలిత కళాతోరణంలో జరిగిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా క్రైస్తవులపై వరాల జల్లు కురిపించారు. న్యూ ఇయర్ రోజును కూడా సెలవుగా ప్రకటిస్తామన్నారు. తెలంగాణలో దళిత క్రిస్టియన్లను దళితులతో సమానంగా చూస్తామని ఆయన తెలిపారు. హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో క్రైస్తవ భవన్ ను పది కోట్ల రూపాయలతో నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎవరు ఏ మతం పుచ్చుకున్నా కులం మారదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే హాస్టల్ సదుపాయం, స్కాలర్ షిప్ వంటివి కూడా దళిత క్రిస్టియన్లకు వర్తింపజేస్తామని ఆయన వెల్లడించారు.