: 2015 వన్డే వరల్డ్ కప్ కు రెండు ప్రారంభోత్సవాలు


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. కాగా, ఈ టోర్నీకి ఫిబ్రవరి 12న రెండు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే ప్రారంభోత్సవానికి మెల్ బోర్న్ ఆతిథ్యమిస్తుండగా, న్యూజిలాండ్ లో జరిగే ప్రారంభోత్సవానికి క్రైస్ట్ చర్చ్ ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్ లు ఫిబ్రవరి 14 నుంచి జరుగుతాయి. తొలిరోజు జరిగే మ్యాచ్ లలో శ్రీలంకతో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో ఆస్ట్రేలియా తలపడతాయి. కాగా, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 15న అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లకు టోర్నీలో అదే తొలి మ్యాచ్.

  • Loading...

More Telugu News