: కేసీఆర్ పై వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టి.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా, రేవంత్ రెడ్డిపై న్యాయవాది గోవర్ధన్ రెడ్డి ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, రేవంత్ పై ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అందుకు సంబంధించిన చార్జిషీట్ ను నాంపల్లి కోర్టుకు సమర్పించారు. రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేయాలని కోర్టుకు పోలీసులు విన్నవించారు. దీంతో, మరో రెండు మూడు రోజుల్లో రేవంత్ కు కోర్టు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News