: రసపట్టులో బ్రిస్బేన్ టెస్టు


బ్రిస్బేన్ టెస్టు రసపట్టులో పడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (408)కు జవాబుగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ను 505 పరుగుల వద్ద ముగించింది. తద్వారా భారత్ పై 97 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, భారత్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 71 పరుగులతో మూడో రోజు ఆట ముగించింది. చేతిలో 9 వికెట్లున్న నేపథ్యంలో, ఆట ఆసక్తికరంగా మారింది. నాలుగోరోజు ఆటలో బ్యాట్స్ మెన్ రాణించి భారీ స్కోరు సాధిస్తే, ఆసీస్ కు కష్టసాధ్యమైన లక్ష్యం నిర్దేశించవచ్చు. మూడోరోజు ఆటలో ఆసీస్ టెయిలెండర్లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా, మిచెల్ జాన్సన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 93 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో జాన్సన్ 88 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ (52) కూడా తనవంతుగా ఓ ఫిఫ్టీ నమోదు చేశాడు. చివర్లో హేజిల్ ఉడ్ (32 నాటౌట్), లియాన్ (23) కూడా బ్యాట్లు ఝుళిపించడంతో ఆసీస్ 500 మార్కు అధిగమించింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 3, ఉమేశ్ యాదవ్ 3 వరుణ్ ఆరోన్ 2, అశ్విన్ 2 వికెట్లు తీశారు. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 41 పరుగుల వద్ద ఓపెనర్ విజయ్(27) వికెట్ కోల్పోయింది. విజయ్ ని స్టార్క్ బౌల్డ్ చేశాడు. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ధావన్ 26, పుజారా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News