: టీఆర్‌ఎస్ కరెంటు బకాయి రూ.4 లక్షలు, హైదరాబాద్ కలెక్టర్ బకాయి రూ.20 లక్షల పైనే!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కరెంటు బిల్లు బకాయి రూ.4,42,480 కు చేరింది. ఈ విషయాన్ని టీఎస్‌పీడీసీఎల్ తన అధికార వెబ్ సైట్ లో పేర్కొంది. మొత్తం 39,588 మంది వినియోగదారులు రూ.50 వేల రూపాయలకు పైన బకాయి ఉన్నారని పేర్కొంది. మింట్ కాంపౌండ్‌లోని ఈడీ జనరల్ సెక్రటరీ, వర్కర్ యూనియన్ పేరు మీద రూ.39,74,951 పెండింగ్ బిల్లు ఉంది. హైదరాబాద్ కలెక్టర్ నుంచి రూ.20,24,027, రాజ్ భవన్ నుంచి రూ.8,89,029 బకాయి రావాల్సి ఉంది. సిటీ క్రిమినల్ కోర్టు చీఫ్ జడ్జి పేరిట రూ.4,11,359, చంచల్ గూడ జైలు పేరిట రూ.7,33,007 బకాయి ఉన్నట్టు వెబ్ సైట్ చెబుతోంది.