: కొడుకుతో కలిసి అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది: అమితాబ్
ఒకే వేదికపై కుమారుడు అభిషేక్ తో కలిసి అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందం కలిగించిందని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. బిగ్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ అవార్డ్స్ లో తండ్రీకొడుకులు అమితాబ్, అభిషేక్ కు అవార్డులు లభించాయి. అమితాబ్ కు 'భూత్ నాథ్ రిటర్న్స్'లో పోషించిన పాత్రకు గాను అవార్డు లభించగా, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలో పోషించిన పాత్రకు అభిషేక్ బచ్చన్ కు అవార్డు లభించింది. రెండు అవార్డులు ఒకే వేదికపై, ఒకే సమయంలో అవార్డు అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఒకే వేదికపై తామిద్దరికీ అవార్డు అందజేయడం ఆనందం కలుగచేసిందని ఆయన పేర్కొన్నారు.