: రూ.8,999కే 4జీ స్మార్ట్‌ ఫోన్... డౌన్ లోడ్ స్పీడ్ సెకనుకు 150 మెగా బైట్లు


'యూ' బ్రాండ్ సిరీస్ నుంచి తొలి 4జీ స్మార్ట్‌ ఫోన్ 'యూ యురేకా'ను రూ.8,999 ధరకు అందించనున్నట్టు మైక్రోమ్యాక్స్ వెల్లడించింది. తమ సంస్థ నుంచి ఇది తొలి 4జీ మొబైల్ అని, శ్యానోజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుందని మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు. అమెజాన్‌ డాట్‌ ఇన్‌ లో ముందస్తు రిజిస్ట్రేషన్లు నేటి నుంచి ప్రారంభమవుతాయని, వచ్చే నెల రెండో వారం నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ డ్యూయల్ సిమ్ 4జీ స్మార్ట్‌ ఫోన్‌ లో క్వాల్‌ కామ్ స్నాప్‌ డ్రాగన్ 615 ఆక్టాకోర్ ప్రాసెసర్, 5.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమెరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. 4జీ కనెక్షన్ తో సెకనుకు 150 మెగా బైట్ల వరకూ డౌన్ లోడ్, 50 మెగా బైట్ల వరకూ అప్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News