: జాతీయ క్రీడల నిర్వహణకు ఆసక్తి చూపని ఆంధ్రప్రదేశ్


చెన్నైలో ఈరోజు భారత ఒలింపిక్ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. 2017 లో 37వ జాతీయ క్రీడలు తెలంగాణలో నిర్వహించాలని నిర్ణయించారు. 35వ జాతీయ క్రీడలు కేరళలో 2015 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్నాయి. మొత్తం 36 విభాగాల్లో పోటీలు జరగనుండగా, 414 బంగారు పతకాలు, 414 రజత పతకాలు, 541 కాంస్య పతకాల కోసం ఆటగాళ్లు పోటీపడనున్నారు. 36వ జాతీయ క్రీడలు (2016) గోవాలో, 38వ జాతీయ క్రీడలు(2018) కోల్‌ కతాలో జరగనున్నాయి. కాగా, జాతీయ క్రీడల నిర్వహణకు బిడ్ దాఖలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఆసక్తి కనబరచలేదు. 38వ జాతీయ క్రీడలకు సంబంధించి బిడ్డింగ్ లో భాగంగా ఒలింపిక్ సంఘం సమావేశం కాగా, రూ.50 లక్షల డీడీ ఇవ్వడంలో ఏపీ క్రీడల విభాగం అధికారులు చొరవ చూపలేదు. ఏపీ సర్కారుకు, క్రీడల విభాగం అధికారులకు మధ్య దూరం పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News